మళ్లీ ఈ కాంబో నిజమేనా ‘బ్రో’ ?

గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. సముద్రఖని ఆ మూవీలో పవన్‌ని ఓ పవర్‌ఫుల్.. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్‌లో చూపించి ఫ్యాన్స్‌ని మేస్మరైజ్ చేశారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి టాక్ వినిపిస్తుండగానే.. ఫ్యాన్ బేస్‌లో హైప్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయింది.;

By :  K R K
Update: 2025-06-13 02:13 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ రేంజ్‌లో బజ్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ యాక్టర్, స్టార్ డైరెక్టర్ సముద్రఖని మరోసారి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరోసారి కొలాబరేట్ కానున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో ఫుల్ స్పీడ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. సముద్రఖని ఆ మూవీలో పవన్‌ని ఓ పవర్‌ఫుల్.. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్‌లో చూపించి ఫ్యాన్స్‌ని మేస్మరైజ్ చేశారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి టాక్ వినిపిస్తుండగానే.. ఫ్యాన్ బేస్‌లో హైప్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయింది.

ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ ఈ రీయూనియన్ ఐడియా మాత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోంది. బ్రో’ సినిమాకు సముద్రఖని, పవన్ కొలాబరేషన్ బాగా క్లిక్ అయింది. అందుకే ఈ ప్రాజెక్ట్ కూడా అదే రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. సముద్రఖని స్టోరీ టెల్లింగ్ స్కిల్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్స్‌లో ఫుల్ జోష్ గ్యారంటీ అని అంతా ఫీలవుతున్నారు.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ ఇప్పటికే సూపర్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1, దే కాల్ హిమ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న టైమ్‌లో, సముద్రఖనితో కొత్త సినిమా రూమర్స్ ఫ్యాన్స్‌కి డబుల్ ఎక్స్‌సైట్‌మెంట్ ఇస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లైనప్‌లోకి యాడ్ అవుతుందా? అయితే ఇది ఎలాంటి జానర్‌లో ఉంటుంది? మాస్ యాక్షనా, ఎమోషనల్ డ్రామా, లేక సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనరా? ఇలా ఒక్కో ప్రశ్న ఫ్యాన్స్‌లో హైప్‌ని మరింత పెంచేస్తోంది. మరి ఈ వార్తల్లోని నిజానిజాలేంటో చూడాలి.

Tags:    

Similar News