పవన్ కళ్యాణ్ - అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్ ?

టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు.. పవన్ కళ్యాణ్‌తో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ ఉందని రివీల్ చేశారు.;

By :  K R K
Update: 2025-10-14 00:23 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ మూవీ 'ఓజీ' తో బిగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాదు, బాక్సాఫీస్‌ను షేక్ చేసే మెగా బ్లాక్‌బస్టర్‌ను కొట్టారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు.. పవన్ కళ్యాణ్‌తో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ ఉందని రివీల్ చేశారు.

రీసెంట్‌గా తెలుగు మీడియాతో మాట్లాడిన దిల్ రాజును, 'వకీల్ సాబ్' తర్వాత పవన్‌తో ఇంకో సినిమా ఉంటుందా అని అడిగారు. దీనికి రాజు ఇచ్చిన రిప్లై చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తాను ఖచ్చితంగా కళ్యాణ్‌తో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు.

"ఈ ప్రాజెక్ట్‌కు కళ్యాణే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, దాని కోసం మేము చాలా పేషెంట్‌గా వెయిట్ చేస్తున్నాం. ఆయన ఓకే చెబితే, వెంటనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తాం" అని రాజు క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో, పవన్-రాజు కాంబోలో డైరెక్టర్ ఎవరు ఉంటారనే డిస్కషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి.

దిల్ రాజుకు క్లోజ్‌గా ఉండే డైరెక్టర్ అనిల్ రావిపూడితో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనిల్ ఆల్రెడీ చిరంజీవితో సంక్రాంతి ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. కాబట్టి, మెగా బ్రదర్స్ ఇద్దరినీ డైరెక్ట్ చేసే క్రెడిట్ అనిల్‌కు దక్కితే అది మెగా ఫ్యాన్స్‌కు పండగే.

అంతేకాదు, అనిల్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు అది మామూలు ట్రీట్ కాదు. అనిల్ స్టైల్‌లో 'సరిలేరు నీకెవ్వరు' తరహాలో బిగ్ స్కేల్‌లో ఉండే కమర్షియల్ ఫిల్మ్‌ను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

Tags:    

Similar News