ఆర్యన్ నుంచి రొమాంటిక్ మెలోడీ
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు పొందిన కథానాయకుల్లో విష్ణు విశాల్ ఒకడు. లేటెస్ట్ గా విష్ణు విశాల్ 'ఆర్యన్' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు.;
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు పొందిన కథానాయకుల్లో విష్ణు విశాల్ ఒకడు. లేటెస్ట్ గా విష్ణు విశాల్ 'ఆర్యన్' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర, ఆర్యన్ రమేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. గతంలో విష్ణు విశాల్ నటించిన 'రాట్ససన్' తరహాలో హత్యల దర్యాప్తు చుట్టూ తిరిగే కథ, ఇంటెన్స్ విజువల్స్ తో 'ఆర్యన్' రాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘I Am The Guy’ సాంగ్ రిలీజయ్యింది. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం, జిబ్రాన్ – శ్రీకాంత్ హరిహరన్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా మారాయి. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ లపై చిత్రీకరించిన ఈ గీతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మానస చౌదరి, సెల్వరాఘవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ సంస్థ ద్వారా హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.