‘ఏజెంట్ మిర్చి’ గా అదరగొట్టనున్న శ్రీలీల !
బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి “ఏజెంట్ మిర్చి” లుక్‌ని షేర్ చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది. సినిమా డీటెయిల్స్ చెప్పకుండా, ఆ పోస్ట్‌కి "రెడీ, స్టెడీ, ఫైర్... మిర్చి లగ్నే వాలీ హై! అక్టోబర్ 19 ఆగ్ లగా దే" అని క్యాప్షన్ పెట్టింది.;
‘గుంటూరు కారం, ధమాకా’ లాంటి సినిమాల్లో తన గ్లామర్ రోల్స్, అదిరిపోయే డ్యాన్స్‌లతో అదరగొట్టిన శ్రీలీల, ‘పుష్ప 2’ లోని స్పెషల్ సాంగ్‌తో మరింత పాపులర్ అయింది. ఇప్పుడు ఆమె తన రూట్ మార్చేసింది. ముందుగా కార్తీక్ ఆర్యన్‌తో ఒక లవ్ స్టోరీతో బాలీవుడ్‌లో ఎంట్రీ కన్ఫర్మ్ చేసుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా యాక్షన్ జోన్ లోకి అడుగుపెడుతోంది.
ఈ రోజు, తను చేయబోతున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి “ఏజెంట్ మిర్చి” లుక్‌ని షేర్ చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది. సినిమా డీటెయిల్స్ చెప్పకుండా, ఆ పోస్ట్‌కి "రెడీ, స్టెడీ, ఫైర్... మిర్చి లగ్నే వాలీ హై! అక్టోబర్ 19 ఆగ్ లగా దే" అని క్యాప్షన్ పెట్టింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యాక్టర్ బాబీ డియోల్ కూడా ఇదే హ్యాష్‌ట్యాగ్‌తో తన 'ప్రొఫెసర్ వైట్ నాయిస్' లుక్‌ని రీసెంట్‌గా షేర్ చేశారు.
దీన్ని చూస్తుంటే.. వాళ్ళందరూ ఏదో ఒకే యూనివర్స్‌లో భాగం కావొచ్చు లేదా కామన్ ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో లీడ్ రోల్‌లో రణవీర్ సింగ్ నటిస్తున్నారని, శ్రీలీల చాలా బోల్డ్‌గా ఉండే అండర్‌కవర్ ఏజెంట్ పాత్ర చేస్తోందని టాక్. తన కొత్త, బోల్డ్ అవతార్‌తో శ్రీలీల... గ్లామర్‌ని ఎంత ఈజీగా చేస్తుందో యాక్షన్‌ని కూడా అంతే ఈజీగా దుమ్ము దులిపేస్తుందని ప్రూవ్ చేసింది.