మెగాస్టార్ కోసం పరిశీలనలో ఇద్దరు హీరోయిన్స్ ?
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధానంగా పరిశీలనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బ్యాకప్ ఎంపికగా మరో బ్యూటీ అదితి రావు హైదరి పేరు కూడా పరిశీలనలో ఉంది.;
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ఉగాది సందర్భంగా ప్రారంభంకానుంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించి రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ హాజరయ్యే అవకాశముంది.
ఇటీవల అనిల్ రావిపూడి తుదివర్షన్ స్క్రిప్ట్‌ను సమర్పించి గ్రీన్ సిగ్నల్ పొందారు. దీంతో షూటింగ్‌లో ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే నటీనటుల తేదీలను ఫిక్స్ చేసుకున్న చిత్రబృందం, సినిమా సంక్రాంతి 2026 నాటికి విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. చిరంజీవి కాల్ షీట్స్ పూర్తిగా ఖాళీగా లేకపోయినా... ఈ ప్రాజెక్ట్‌కు ఎలాంటి షెడ్యూల్ ఇబ్బందులు లేవని సమాచారం.
ఇంక హీరోయిన్స్ ఎంపిక విషయంలో అనిల్ రావిపూడి మరోసారి తన వ్యూహాత్మక ఆలోచనను ప్రదర్శిస్తున్నారు. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధానంగా పరిశీలనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బ్యాకప్ ఎంపికగా మరో బ్యూటీ అదితి రావు హైదరి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆఫర్ ఇచ్చినా... ఇప్పటివరకు అధికారిక సమాధానం రాలేదని తెలుస్తోంది. ఉగాది సందర్భంగా.. ఈ విషయంపై క్లారిటీ వస్తుందా లేదా అనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.
ఇక సీనియర్ నటి అంజలిని కూడా కథానాయికగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్ ఎంపిక చేయడం దర్శకులకు పెద్ద సవాలుగా మారింది. తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లు సిద్ధంగా ఉన్నా, చిత్రబృందం కొత్త ఛాయస్‌లను పరిశీలించాలని భావిస్తోంది.