‘ఓ భామ అయ్యో రామా’ టీజర్ వస్తోంది!

Update: 2025-03-21 12:55 GMT

యంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామా'. రామ్ గోదాల దర్శకత్వంలో పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రాబోతుంది. మార్చి 24న టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.




 


ఈ మూవీలో సుహాస్ లుక్ సరికొత్తగా ఉంది. సుహాస్ కి జోడీగా మాళవిక మనోజ్ నటిస్తుంటే.. ఇతర కీలక పాత్రలో 'నువ్వు నేను' ఫేం అనితా హస్సానందని కనిపించనుంది. ఇంకా ఆలీ, బబ్లూ పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతుంది.

Tags:    

Similar News