హిస్టారిక్ బయోపిక్ లో తారక్ ?

ఎన్టీఆర్ ఒక నటనాపరమైన పాత్రలో కనిపించనున్నాడన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం... ఎన్టీఆర్ "మేడిన్ ఇండియా" అనే బయోపిక్‌లో నటించ నున్నాడని తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-05-15 13:34 GMT

తారక్ అంటే అద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రెస్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. తనలో ఉన్న నైపుణ్యం సామాన్యమైనది కాదు. అయితే... గత కొంతకాలంగా తాను ఎక్కువగా కమర్షియల్ యాక్షన్ చిత్రాలకే పరిమిత మవుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. నటుడిగా తను పూర్తి ప్రతిభను ప్రదర్శించడం లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇప్పుడు ఈ విమర్శలకు సమాధానం అన్నట్టుగా ఎన్టీఆర్ ఒక నటనాపరమైన పాత్రలో కనిపించనున్నాడన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం... ఎన్టీఆర్ "మేడిన్ ఇండియా" అనే బయోపిక్‌లో నటించ నున్నాడని తెలుస్తోంది. ఇది భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పణలో, జాతీయ అవార్డు విజేత నితిన్ కక్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కథలోని గంభీరత, చారిత్రక ప్రాముఖ్యత, కథనంలోని డీటెయిలింగ్ .. అన్నీ ఎన్టీఆర్‌ని ఆకట్టుకున్నాయని తెలుస్తోంది.

ఆరు భాషల్లో పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం.. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది. ఇది పూర్తిగా భిన్నమైన ఛాలెంజ్ కావడమే కాకుండా, అతని నటనా ప్రావీణ్యానికి ఒక పెద్ద వేదికగా మారనుంది. ప్రస్తుతం ఇదంతా ప్రారంభ దశలో ఉన్నా... ఈ ప్రాజెక్ట్ వాస్తవంగా ప్రారంభమై, పూర్తి అయితే మాత్రం... ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత విలక్షణమైన చిత్రంగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News