తాజా షెడ్యూల్ మొదలైంది !

కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఇది సెప్టెంబర్ 19 వరకు కొనసాగుతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు.;

By :  K R K
Update: 2025-09-06 03:43 GMT

మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌ను కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ స్టార్ట్ చేశారు. కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఇది సెప్టెంబర్ 19 వరకు కొనసాగుతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. వాటిలో ఒకటి చిరంజీవి, నయనతారల మధ్య రొమాంటిక్ డ్యూయెట్, ఇది ఈ షెడ్యూల్ ముగిసేలోపు కంప్లీట్ అవుతుందని అంచనా.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ పాటలను కంపోజ్ చేశారు. ఇది చిరంజీవితో ఆయన మొదటి కొలాబరేషన్. ముఖ్యమైన రోల్‌లో కనిపించనున్న విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి.. ఈ పాటల షూటింగ్ పూర్తయిన తర్వాత సెట్స్‌లో జాయిన్ అవుతారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఫుల్-ఆన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు, నయనతార గ్లామరస్.. లైవ్లీ రోల్‌లో కనిపించనున్నారు.

Tags:    

Similar News