‘మిరాయ్’ సెన్సార్ పూర్తి .. రన్ టైమ్ ఎంతంటే..!

తాజాగా, ‘మిరాయ్’ సినిమా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, యూ/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 49 నిమిషాలుగా నిర్ణయించినట్టు నిర్మాతలు తెలిపారు.;

By :  K R K
Update: 2025-09-06 04:25 GMT

యువ కథానాయకుడు తేజ సజ్జా నటిస్తున్న పాన్-ఇండియా సినిమా ‘మిరాయ్’ సినీ ప్రియులలో అపూర్వమైన ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘హనుమాన్’ సినిమా విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ.. ఈసారి మరింత ప్రతిష్టాత్మకమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సన్నద్ధమవుతున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్-ఫాంటసీ డ్రామా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

‘మిరాయ్’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం సినీ లవర్స్ ఆతృతతో ఉన్నారు, ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని కళ్లు కాయలు కాసేలా వేచి ఉన్నారు. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలు కూడా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక, సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. కానీ, తేజ సజ్జా మాత్రం స్మార్ట్‌గా పరిమిత వనరులతోనే అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తూ, సూపర్ హీరోగా తనదైన ముద్ర వేస్తున్నాడు.

తాజాగా, ‘మిరాయ్’ సినిమా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, యూ/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, “ఈ సినిమాలోని కథాంశం, అత్యద్భుతమైన విజువల్స్, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకర్షిస్తాయి” అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 49 నిమిషాలుగా నిర్ణయించినట్టు నిర్మాతలు తెలిపారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. గౌరహరి సమకూర్చిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Tags:    

Similar News