మహిళా సాధికారతకు ‘నారి’ గళం!
సీనియర్ నటీమణి ఆమని ప్రధాన పాత్రలో, వికాస్ వశిష్ఠ, మౌనికా రెడ్డి, ప్రగతి, సునయన తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నారి’. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శశి వంటిపల్లి నిర్మించిన ఈ సినిమా మహిళా సాధికారత అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయనుందట.
మహిళల గౌరవం, భద్రత, ముఖ్యంగా 13–20 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల గురించి ఈ సినిమాలో చర్చించినట్టు చిత్రబృందం చెబుతోంది. మహిళల గురించి సామాజిక స్పృహ కలిగించే ఈ చిత్రాన్ని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో మార్చి 7 & 8 తేదీల్లో కపుల్స్ కోసం టికెట్స్‌పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు మంచి స్పందన పొందాయి. ముఖ్యంగా వినోద్ విన్ను సంగీత దర్శకత్వంలో, భాస్కరభట్ల రాయగా సునీత పాడిన ‘హవాయి హవాయి హవా..’ పాటైతే యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (మార్చి 7) ‘నారి‘ సినిమా థియేటర్లలోకి వస్తోంది.