ఒక్క వేదికపై నాని-విజయ్!

Update: 2025-03-12 11:09 GMT

నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అనే రచ్చ సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. ఈ ఇద్దరి హీరోల అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. అయితే ఆ రచ్చకు ఇప్పుడు తెరపడినట్టే అయ్యింది.




 2015లో విడుదలైన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో నాని, విజయ్ దేవరకొండ కలిసి పనిచేశారు. ఈ సినిమా ద్వారానే నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం మార్చి 21కి పదేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని.. నాని, విజయ్ దేవరకొండ ఒకే వేదికపైకి వచ్చారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘ సినిమాలోని నాని, విజయ్, మాళవిక ముగ్గురూ ఐకానిక్ బైక్ సీన్ ను రీక్రియేట్ చేశారు. ఈ మధుర క్షణం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నాని-విజయ్ దేవరకొండ మధ్య రైవల్రీ ఉన్నట్టు వచ్చిన పుకార్లకు ముగింపు పడినట్లయింది. మరోవైపు నాని ‘హిట్ 3, ది ప్యారడైజ్‘ సినిమాలతో బిజీగా ఉంటే.. విజయ్ ‘కింగ్ డమ్‘తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Tags:    

Similar News