నానీ - సుజీత్ సినిమాకి టైటిల్ ఇదేనా?

ఈ సినిమాకి ‘బ్లడీ రోమియో’ అనే స్టన్నింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.;

By :  K R K
Update: 2025-10-01 09:20 GMT

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ' విజయోత్సాహంతో ఉన్నాడు. తన కెరీర్ లో డైరెక్టర్ గా ముచ్చటగా మూడో సినిమాను పవర్ స్టార్ తో తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను నేచురల్ స్టార్ నానీతో ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘బ్లడీ రోమియో’ అనే స్టన్నింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

కొన్ని నెలల క్రితం ప్రకటించిన ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. కారణం.. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2 న జరగనుండడమే. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఇది యాక్షన్ మిళితమైన డార్క్ కామెడీని 'ఓజీ' చిత్ర నిర్మాతలు సహకారం అందిస్తున్నారు, సంగీతాన్ని ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న నానీ.. అది కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్ గా చేయబోయేది సుజీత్ సినిమానే. మరి ‘బ్లడీ రోమియో’ గా నానీని సుజీత్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.  

Tags:    

Similar News