నానీ - శేఖర్ కమ్ముల కాంబో?
తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నాచురల్ స్టార్ నానితో టీమప్ అవ్వబోతున్నారని టాక్. ఇద్దరూ ఇప్పటికే కలిసి ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినట్లు, ఫైనల్ గా ఒక అంగీకారానికి వచ్చినట్లు రిపోర్ట్స్ సర్కులేట్ అవుతున్నాయి.;
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన కెరీర్లో తెరకెక్కించిన మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రం “కుబేర” సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించడానికి ఎదురైన ఒత్తిడి, ఒడిదుడుకుల నుంచి ఇప్పుడు ఆయన కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌తో శేఖర్‌కి ఒక రకమైన రిలీఫ్ దొరికినట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగానే .. శేఖర్ కమ్ముల తన సిగ్నేచర్ స్టైల్లో రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లబోతున్నారు.
రెండు నెలల పాటు తన టీమ్‌తో, ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రేక్ తర్వాత.. ఆయన తన తదుపరి స్క్రిప్ట్‌పై ఫోకస్ పెట్టబోతున్నారని టాక్. శేఖర్ అంటేనే కథల్లో ఎమోషన్స్, రియలిస్టిక్ క్యారెక్టర్స్, హృదయాన్ని తాకే డైలాగ్స్‌కి ఫేమస్. కాబట్టే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో హైప్ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నాచురల్ స్టార్ నానితో టీమప్ అవ్వబోతున్నారని టాక్. ఇద్దరూ ఇప్పటికే కలిసి ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినట్లు, ఫైనల్ గా ఒక అంగీకారానికి వచ్చినట్లు రిపోర్ట్స్ సర్కులేట్ అవుతున్నాయి. “కుబేర” రిలీజ్‌కి మూడు నెలల ముందు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో నానితో మీటింగ్ జరిగిందని, కలిసి పని చేయడం గురించి మాట్లాడామని చెప్పారు. కానీ, అప్పట్లో ఇది కేవలం డిస్కషన్ స్టేజ్‌లోనే ఉంది. అధికారికంగా ఏదీ లాక్ కాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాక్ మళ్లీ జోరందుకోవడంతో, ఫ్యాన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.
అయితే “కుబేర” సినిమా తెలుగు మార్కెట్లో బాగా ఆడినా, ఇతర భాషల్లో అంతగా క్లిక్ కాలేదని, అందుకే శేఖర్ బలం ఎక్కడుందో అక్కడే ఫోకస్ చేయడం బెటర్ అని వాళ్ల అభిప్రాయం. శేఖర్ సినిమాలు అంటే తెలుగు ఆడియన్స్‌కి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ‘హ్యాపీడేస్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ’ లాంటి సినిమాలతో ఆయన తన క్రాఫ్ట్‌ని పర్ఫెక్ట్గా ప్రూవ్ చేశారు కదా. కాబట్టి, మరో పాన్-ఇండియా ట్రై చేయడం కంటే, తెలుగు రూట్స్‌తో కూడిన ఓ హార్ట్ టచింగ్ కథని తెరపైకి తీసుకొస్తే, అది ఆడియన్స్‌ని మరింత ఆకట్టుకుంటుందని ఇన్సైడర్స్ ఫీలవుతున్నారు. మరి శేఖర్ నానీతో ఏ సినిమా చేస్తాడో చూడాలి.