తొలిసారి కెమేరా ముందుకు బాలయ్య చిన్న కుమార్తె

హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రతిష్టాత్మక నగల బ్రాండ్‌కు ఎండార్స్‌మెంట్ చేయనుంది. ఈ వాణిజ్య ప్రకటన షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ముగిసింది.;

By :  K R K
Update: 2025-10-08 01:26 GMT

నట సింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని తొలిసారిగా కెమెరా ముందుకి రాబోతోంది. ఇప్పటివరకు తెర వెనుక ఉండి తన తండ్రి ప్రాజెక్ట్‌లను పర్యవేక్షిస్తూ, నిర్మాణ వ్యవహారాలను చూసుకున్న తేజస్విని, ఇప్పుడు స్క్రీన్ మీద తన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రతిష్టాత్మక నగల బ్రాండ్‌కు ఎండార్స్‌మెంట్ చేయనుంది.

ఈ వాణిజ్య ప్రకటన షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ముగిసింది. సాధారణంగా లో-ప్రొఫైల్‌లో, రిజర్వ్‌డ్‌గా ఉండే తేజస్విని కెరీర్‌లో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌పై తేజస్విని ఆసక్తి పెరుగుతోందని ఈ తొలి అడుగు తెలియజేస్తుందని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

నగల బ్రాండ్, రాబోయే ప్రచార కార్యక్రమం ప్రారంభం గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే, తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకొచ్చే ఈ ప్రయత్నం షోస్టాపర్‌గా నిలుస్తుందని అందరూ అను కుంటున్నారు. మరి తేజస్విని స్ర్కీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. 

Tags:    

Similar News