కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న ‘మీసాల పిల్ల’ ప్రోమో
ఉదిత్ నారాయణ్ వాయిస్ యాడ్ అవ్వడం, చిరంజీవి ఈజీ స్క్రీన్ ప్రెజెన్స్, సింపుల్ డ్యాన్స్ మూవ్స్, నయనతార లుక్ కలగలిసి... పాత సినిమాల్లోని క్లాసిక్ ఫీల్‌ను, లేటెస్ట్ టచ్‌ను ఇచ్చాయి.;
సాధారణంగా ఒక పాట హిట్ అవ్వడానికి మంచి ట్యూన్, అదిరిపోయే వాయిస్, క్యాచీ లిరిక్స్, విజువల్స్... ఇవన్నీ చాలా ముఖ్యం. కానీ, పూర్తి సాంగ్ రిలీజ్ అయినంత బజ్ కేవలం ఒక చిన్న ప్రోమోకే రావడం చాలా అరుదు. మెగాస్టార్ చిరంజీవి మోస్ట్-అవైటెడ్ సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' నుండి వచ్చిన మొదటి సింగిల్ 'మీసాల పిల్లా' ప్రోమో విషయంలో సరిగ్గా అదే జరిగింది.
ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన ట్యూన్... చార్మ్, మెలోడీ, నాస్టాల్జియా ఫీల్ ను అద్భుతంగా మిక్స్ చేసింది. ఈ ప్రోమోకి ఉదిత్ నారాయణ్ వాయిస్ యాడ్ అవ్వడం, చిరంజీవి ఈజీ స్క్రీన్ ప్రెజెన్స్, సింపుల్ డ్యాన్స్ మూవ్స్, నయనతార లుక్ కలగలిసి... పాత సినిమాల్లోని క్లాసిక్ ఫీల్‌ను, లేటెస్ట్ టచ్‌ను ఇచ్చాయి.
ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఇటీవల రిలీజ్ అయిన చాలా పూర్తి పాటల కంటే కూడా ఈ చిన్న ప్రోమోనే ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. దానిలోని అదిరిపోయే రిథమ్, రొమాంటిక్ ఎనర్జీ సోషల్ మీడియాను ఊపేసింది. వేలల్లో రీల్స్ తయారయ్యాయి, మ్యూజిక్ లవర్స్‌కి వెంటనే ఫేవరెట్‌గా మారింది. ఈ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేయడంతో, ఫుల్ సాంగ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ తారాస్థాయికి చేరాయి.