రామోజీ ఫిల్మ్ సిటీలో ‘మిరాయ్’ యాక్షన్ సీక్వెన్స్ !
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం భారీగా, ఆకర్షణీయంగా, సరికొత్త ట్విస్ట్‌లతో నిండి ఉంటుందని టాక్.;
‘హనుమాన్’ సినిమాతో భారీ ఆదరణ పొందిన యంగ్ హీరో తేజ సజ్జా... మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. అతని తదుపరి చిత్రం ‘మిరాయ్’ షూటింగ్ జోరుగా సాగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం భారీగా, ఆకర్షణీయంగా, సరికొత్త ట్విస్ట్‌లతో నిండి ఉంటుందని టాక్.
ఇది సాధారణ స్టంట్ షూట్ కాదు. సినిమా విడుదలైన తర్వాత అందరూ మాట్లాడుకునేలా ఒక హై-ఇంటెన్సిటీ, విజువల్‌గా రిచ్‌గా ఉండే ఫైట్ సీక్వెన్స్‌ను రూపొందించేందుకు టీమ్ పూర్తిగా కసరత్తు చేస్తోంది. స్కేల్ నుంచి సెటప్ వరకు, ‘మిరాయ్’తో మేకర్స్ భారీ లక్ష్యాలను పెట్టుకున్నారన్నది స్పష్టం.
యాక్షన్‌తో పాటు.. సినిమాలోని ఒక పాట కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే వారం విడుదల కానున్న ఈ పాట.. సినిమా టోన్‌ను పూర్తిగా ప్రతిబింబిస్తుందని.. ఇది వైబ్రంట్‌గా, ఫాంటసీ-యాక్షన్ కోర్‌తో సమన్వయంగా ఉంటుందని అంటున్నారు. విజువల్స్, కొరియోగ్రఫీ సరికొత్తగా.. స్టైలిష్ వైబ్‌ను తీసుకొస్తాయని టీమ్ చెబుతోంది. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జా ఏం సందడి చేయబోతున్నాడనే ఆసక్తితో అందరి చూపు ‘మిరాయ్’ పైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా బజ్ క్రియేట్ చేస్తోంది.