మంచు ‘రామాయణం’ వర్కవుట్ అవుతుందా?

రామాయణాన్ని రావణుడి దృక్కోణం నుంచి చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నాడు. రావణుడి జననం నుంచి మరణం వరకు కథను చెప్పాలని, తన తండ్రి మోహన్ బాబు రావణుడి పాత్రలో నటించాలని.. ఇతర పాత్రల్లో పలువురు ప్రముఖ నటీనటులు ఉండాలని అతడు ప్లాన్ చేస్తున్నాడు.;

By :  K R K
Update: 2025-07-21 01:00 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. ఇటీవల శివభక్తుడిపై భారీ బడ్జెట్‌తో ‘కన్నప్ప’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడు రామాయణాన్ని రావణుడి దృక్కోణం నుంచి చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నాడు. రావణుడి జననం నుంచి మరణం వరకు కథను చెప్పాలని, తన తండ్రి మోహన్ బాబు రావణుడి పాత్రలో నటించాలని.. ఇతర పాత్రల్లో పలువురు ప్రముఖ నటీనటులు ఉండాలని అతడు ప్లాన్ చేస్తున్నాడు.

ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు.. చాలా సంవత్సరాల క్రితం రావణుడి జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. తమిళ సూపర్‌స్టార్ సూర్యను రాముడి పాత్ర కోసం సంప్రదించానని, కానీ బడ్జెట్ సమస్యలు మరియు ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని తెలిపాడు. “ఈ సినిమాకి స్క్రిప్ట్ రెడీగా ఉంది. దర్శకుడిగా లెజెండరీ ఫిల్మ్‌మేకర్ రాఘవేంద్ర రావు ఉండాల్సింది. రావణుడి పాత్రలో నా తండ్రి నటించాల్సింది. స్క్రిప్ట్, డైలాగులు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ సినిమాను తీయగలనా అనేది తెలియదు,” అని విష్ణు అన్నాడు.

రామాయణం సినిమా తీస్తే ప్రధాన పాత్రల్లో ఎవరు ఉంటారని అడిగినప్పుడు, సూర్య , ఆలియా భట్ రాముడు, సీత పాత్రలకు సరిపోతారని విష్ణు చెప్పాడు. “లక్ష్మణుడి పాత్ర చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. దానికి జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సరిపోతాడు. జటాయువు పాత్రకు బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ గారిని ఎంచుకుంటాను..” అని విష్ణు తెలిపాడు.

Tags:    

Similar News