ఆగిపోయిన సినిమాల్ని తిరిగి పట్టాలెక్కిస్తాడా?

గత కొన్ని సంవత్సరాల్లో 2-3 సినిమాలను ప్రకటించినా.. అవి ఇంకా ప్రారంభం కాలేదు, అలాగే పూర్తి కాలేదు. ఇప్పుడు మనోజ్ జాగ్రత్తగా... ఎలాంటి తొందర లేకుండా ముందుకు సాగుతున్నాడు.;

By :  K R K
Update: 2025-09-16 11:47 GMT

మంచు మనోజ్ నటుడిగా గ్రేట్ కమ్ బ్యాక్ గా ‘మిరాయ్’ సరైన సినిమాగా నిలిచింది. అతని నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో 2-3 సినిమాలను ప్రకటించినా.. అవి ఇంకా ప్రారంభం కాలేదు, అలాగే పూర్తి కాలేదు. ఇప్పుడు మనోజ్ జాగ్రత్తగా... ఎలాంటి తొందర లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఆగిపోయిన ప్రాజెక్ట్‌లను తిరిగి పట్టాలెక్కించానికి, కొత్త సినిమాలను టేకప్ చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.

టాలీవుడ్‌లో లాంగ్ గ్యాప్ తర్వాత, మనోజ్ మంచి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. కొందరు నిర్మాతలు అతనిపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసిన మనోజ్.. దాన్ని తిరిగి ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నాడు. ‘వాట్ ది ఫిష్’ సినిమా కోసం కూడా ప్రీ-ప్రొడక్షన్ దశలో చర్చలు జరుపుతున్నాడు. అలాగే.. ఓ కొత్త దర్శకుడితో ‘డేవిడ్ రెడ్డి’ అనే సినిమాకి ఓకే చెప్పాడు.

బ్లాక్ స్వోర్డ్ పాత్రతో వచ్చిన ప్రశంసల తర్వాత, లీడ్ రోల్స్‌తో పాటు సవాల్‌తో కూడిన పాత్రలపై కూడా ఆసక్తి చూపిస్తున్నాడు మనోజ్. రాబోయే రోజుల్లో మంచు మనోజ్ నటుడిగా బిజీగా ఉండబోతున్నాడు. ఆగిపోయిన ప్రాజెక్ట్‌లను తిరిగి పట్టాలెక్కించడంతో పాటు కొత్త సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు. త్వరలోనే మనోజ్ టీమ్ నుంచి వరుస ప్రకటనలు రాబోతున్నాయి.

Tags:    

Similar News