టాప్ హీరోలకు జోడీగా ఫిక్సయిపోయారు !
హీరోలు 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ... వారిని 20 ఏళ్ల యంగేజ్ లోని నటీమణులతో జత చేస్తున్నారు. ఈ ట్రెండ్ కారణంగానే మమితా బైజు, ఇమాన్వి, కయదు లోహర్ వంటి నటీమణులు పెద్ద సినిమాల్లో అవకాశాలు పొందుతున్నారు.;
తెలుగు అండ్ సౌత్ ఇండస్ట్రీస్ లో యంగ్ అండ్ న్యూ ఫేసెస్ కు.. ముఖ్యంగా కొత్త తరం ప్రేక్షకులలో డిమాండ్ పెరుగుతోంది. త్వరగా జనాదరణ పొందిన నటీమణులు భారీ ఆఫర్లు అందుకుంటున్నారు. హీరోలు 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ... వారిని 20 ఏళ్ల యంగేజ్ లోని నటీమణులతో జత చేస్తున్నారు. ఈ ట్రెండ్ కారణంగానే మమితా బైజు, ఇమాన్వి, కయదు లోహర్ వంటి నటీమణులు పెద్ద సినిమాల్లో అవకాశాలు పొందుతున్నారు.
మమితా బైజు
23 ఏళ్ల మలయాళ బ్యూటీ మమితా బైజు నటించిన “ప్రేమలు” సినిమా సంచలనం సృష్టించింది. ఈ విజయం తర్వాత తమిళ, తెలుగు దర్శకుల దృష్టిని ఆకర్షించింది ఆమె. ప్రస్తుతం ఆమె విజయ్ నటిస్తున్న “జన నాయగన్” లో కీలక పాత్రలో కనిపిస్తోంది. అయితే ఇందులో ఆమె విజయ్ సరసన హీరోయిన్‌గా కాదు. అలాగే, సూర్య నటిస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.
ఇమాన్వి
28 ఏళ్ల ఇమాన్వి.. పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ సరసన “ఫౌజీ” అనే వార్ డ్రామాలో హీరోయిన్‌గా తొలి అడుగు వేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఆమె గుర్తింపు పొంది, ఈ పెద్ద అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆమె వయసు మమితా కంటే కొంచెం ఎక్కువైనప్పటికీ, పెద్ద స్టార్‌తో కొత్త ముఖాన్ని జత చేయడం ఈ ట్రెండ్‌కు సరిపోతుంది.
కయదు లోహర్
కయదు లోహర్ మూడేళ్ల క్రితం తెలుగు సినిమాలో నటించినప్పటికీ, తమిళ చిత్రం “డ్రాగన్” విజయంతో ఆమె గుర్తింపు పొందింది. 25 ఏళ్ల ఈ నటి, నాని నటిస్తున్న “ది ప్యారడైస్” అండ్ సింబు 49వ తమిళ చిత్రంలో నటిస్తోంది.
రుక్మిణి వసంత్
28 ఏళ్ల రుక్మిణి వసంత్, కన్నడ చిత్రం “సప్త సాగరదాచే ఎల్లె సైడ్ ఎ & సైడ్ బి” సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలిచింది. ఆమె పెరుగుతున్న క్రేజ్ తో , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన ఓ యాక్షన్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. సో... అలా మొత్తానికి ఈ యంగ్ అండ్ బ్యూటీస్ .. సౌత్ లోని టాప్ స్టార్స్ తో జోడీ కట్టడం ట్రెండ్ గా మార్చారు.