మెగాస్టార్ సరసన ‘రాజాసాబ్’ బ్యూటీ?

తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి తదుపరి సినిమా కోసం హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ను తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.;

By :  K R K
Update: 2025-10-15 00:30 GMT

హీరోయిన్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి పంథా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఒకవైపు 'విశ్వంభర'లో త్రిష కృష్ణన్, 'మన శంకర వర ప్రసాద్ గారు' లో నయనతార వంటి క్రేజీ సీనియర్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తూనే, మరోవైపు ఆషికా రంగనాథ్, కేథరిన్ థ్రెసా వంటి యంగ్ టాలెంట్‌కు కూడా ఆయన సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో ఛాన్స్ ఇస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి తదుపరి సినిమా కోసం హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ను తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ప్రస్తుతం మాళవిక మోహనన్, ప్రభాస్ హీరోగా వస్తున్న 'ది రాజా సాబ్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అంతకుముందు చిరంజీవికి 'వాల్తేరు వీరయ్య' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ... తన కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో మాళవిక మోహనన్ రెండో కథానాయికగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.

మరోవైపు, మాళవిక మోహనన్ తన రెండో తెలుగు సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆమె నటించిన 'ది రాజా సాబ్' సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె దాని రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. మరి చిరు, మాళవికా మోహనన్ పెయిర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 

Tags:    

Similar News