థియేటర్లలో మహేష్-వెంకీ ఫ్యాన్స్ హంగామా!
2013 సంక్రాంతి బరిలో విడుదలై సూపర్ హిట్టైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. వెంకటేష్ పెద్దోడిగా, మహేశ్ బాబు చిన్నోడిగా నటించిన ఈ మల్టీస్టారర్ మళ్లీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. సమంత, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘ని గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ చేశారు.
దాదాపు 12 ఏళ్ల తర్వాత, ఈ చిత్రం రీ-రిలీజ్ అవ్వడంతో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాని థియేటర్లలో చూడడానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మహేష్, వెంకీ అభిమానులు థియేటర్లలో హల్ చల్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడలో ఓ థియేటర్‌లో ఈ సినిమాలోని పెళ్లి సీన్ ను రీ-క్రియేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘ మరోసారి థియేటర్లలో హిట్ బొమ్మగా నిలిచింది.