ప్రమోషన్స్ కోసం రంగంలోకి ‘కుబేర’

ఈ సినిమా నుంచి తొలి పాటను ఏప్రిల్ 20, 2025న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ఆడియన్స్ ను బాగా అలరించబోతోంది.;

By :  K R K
Update: 2025-04-15 00:41 GMT

శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "కుబేరా" సినిమా చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో మొదలుకా బోతున్నాయి. ఈ సినిమా నుంచి తొలి పాటను ఏప్రిల్ 20, 2025న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ఆడియన్స్ ను బాగా అలరించబోతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, శేఖర్ కమ్ముల దేవి శ్రీ ప్రసాద్ కలయికలో ఇది మొదటి సినిమా కావడం విశేషం.

ఇప్పటికే తన సినిమాల్లో సంగీతాన్ని ప్రత్యేకంగా మలిచే శైలి కలిగిన దర్శకుడిగా శేఖర్ కమ్ముల పేరు సంపాదించారు. "ఆనంద్", "హ్యాపీ డేస్", "ఫిదా", "లవ్ స్టోరీ" వంటి చిత్రాల్లో సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పనిచేస్తుండటంతో ఈ పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటలో ధనుష్ సందడి చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, చిలిపిగా విసిల్ కొడుతూ కనిపించనున్నట్లు సమాచారం. పాట మొత్తం రంగుల పండుగలా ఉండబోతుందట. దీని చిత్రీకరణ విశేషంగా సాగినట్లు టాక్.

ధనుష్‌తో పాటు నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సారభ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన కథతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూన్ 20, 2025న పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ధనుష్ నటన, దేవి శ్రీ సంగీతం కలగలిపి "కుబేరా" సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక మ్యూజికల్ విజువల్ ఫీస్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ పాట కోసం ఎదురు చూస్తూ... కౌంట్‌డౌన్ మొదలైంది!

Tags:    

Similar News