రూటు మార్చిన ‘ఉప్పెన’ బ్యూటీ !

నిన్న మొన్నటి వరకూ “గర్ల్ నెక్స్ట్ డోర్” ఇమేజ్‌తో కనిపించిన ఆమె.. ఇప్పుడు గ్లామరస్ అవతారం ఎత్తింది.;

By :  K R K
Update: 2025-05-08 04:58 GMT

కొన్నిసార్లు తమ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించిన పలువురు నటీమణులు, ఊహించని బాక్సాఫీస్ పరాజయాలతో వెనుకపడతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కృతి శెట్టి ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. వరుస ఫ్లాప్స్  తర్వాత ఆమె క్రేజ్ చాలా తగ్గిపోయింది. ఆమె గత చిత్రం ‘మనమే’ కూడా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. ఈ చిత్రం ఫెయిల్యూర్... ఆమె కెరీర్‌పై మరింత ప్రభావం చూపింది.

తమిళ, మలయాళ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా, అక్కడ కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ దక్కలేదు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో తన స్థానం తిరిగి పొందేందుకు కృతి శెట్టి కొత్త దారిలో ప్రయాణం ప్రారంభించింది. నిన్న మొన్నటి వరకూ “గర్ల్ నెక్స్ట్ డోర్” ఇమేజ్‌తో కనిపించిన ఆమె.. ఇప్పుడు గ్లామరస్ అవతారం ఎత్తింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టులు చూస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. థై హై స్లిట్ డ్రెస్‌లు, మిడ్‌రిఫ్ షో అవుట్‌ఫిట్స్‌తో కనిపిస్తూ... తనలోని కొత్త ఫ్యాషన్ ఫార్వర్డ్ లుక్‌ను వెలుగులోకి తీసుకువస్తోంది. ఈ డేర్ అండ్ స్టైలిష్ ఫొటోషూట్లు పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ గ్లామరస్ మేకోవర్ ఆమెను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువస్తుందా? అఖిల్ అక్కినేని సరసన ఓ సినిమాలో ఆమెను తీసుకునే ఆలోచన కూడా పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ బోల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆమె కెరీర్‌కు మళ్లీ ఊపునిస్తుందా? లేదా? అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News