సూర్యకి జోడీగా కీర్తి సురేశ్ ?

ఇందులో హీరోయిన్‌గా నటించేందుకు కీర్తి సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు ఇంకొన్ని పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే కీర్తి పేరు టాప్ కంటెండర్‌గా ఉంది.;

By :  K R K
Update: 2025-04-24 00:34 GMT

పెళ్లి తర్వాత ఓ భారీ అవకాశాన్ని దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న కీర్తి సురేశ్.. తెలుగులో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ అందుకుందనే ప్రచారం ఇప్పుడు సినీవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్యకి జోడీగా ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇటీవల "లక్కీ భాస్కర్" సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్ట్‌కి సన్నాహాలు ప్రారంభించారు.

మారుతి బ్రాండ్ ఎలా ఎదిగిందన్న నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన కథను ఆయన సిద్ధం చేశారని సమాచారం. ఈ కథ వినగానే సూర్య చాలానే ఆసక్తి చూపించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వెంకీ అట్లూరి గతంలో తెరకెక్కించిన "రంగ్ దే", "సార్", "లక్కీ భాస్కర్" సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థే ఈ కొత్త సినిమాను కూడా నిర్మించనుంది.

ఇందులో హీరోయిన్‌గా నటించేందుకు కీర్తి సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు ఇంకొన్ని పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే కీర్తి పేరు టాప్ కంటెండర్‌గా ఉంది. ఇటీవల వ్యాపారవేత్త ఆంథోని తట్టిల్‌ను కీర్తి సురేశ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఆమెకు ఈ చిత్రంలో పాత్ర దక్కుతుందా? లేట్‌గా వచ్చిన ఈ అవకాశాన్ని కీర్తి చేజిక్కించుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News