‘హిట్ 3’ గెస్ట్ హీరోనే... ‘హిట్ 4’ హీరో !
తమిళ స్టార్ కార్తి ‘హిట్ 3’ లో స్పెషల్ క్యామియోగా కనిపించనున్నాడని, అదే ‘హిట్ 4’ కి మార్గం సుగమం చేయనుందని టాక్. కానీ.. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.;
నేచురల్ స్టార్ నాని ఆసక్తికరమైన సినిమాల లైనప్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ వరుసలో ముందుగా మే 1న విడుదల కానున్న శైలేష్ కొలను దర్శకత్వంలోని ‘హిట్ 3’ చిత్రానికి విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్సెస్, పాటలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే, ‘హిట్ 3’ విడుదలకు ముందే ‘హిట్ 4’ లో ప్రధాన పాత్ర పోషించనున్న నటుడిని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, తమిళ స్టార్ కార్తి ‘హిట్ 3’ లో స్పెషల్ క్యామియోగా కనిపించనున్నాడని, అదే ‘హిట్ 4’ కి మార్గం సుగమం చేయనుందని టాక్. కానీ.. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే... ఈ వార్తే నిజమైతే, విశ్వక్ సేన్, అడివి శేష్, నాని తరువాత కార్తి ‘హిట్’ యూనివర్స్‌లో ప్రధాన కథానాయకుడిగా చేరిన నాలుగో నటుడవుతాడు.
మొత్తంగా, నాని హిట్3, ది ప్యారడైజ్ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, కార్తి ‘హిట్’ యూనివర్స్‌లో భాగమవుతాడా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ‘హిట్’ ఫ్రాంచైజీ అభిమానులకు ఈ వార్త నిజమైతే, ఇది మరింత ఆసక్తికరమైన పరిణామం అవుతుంది.