సేతుపతి - పూరీ మూవీలో కన్నడ స్టార్
కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నారని వెల్లడించారు. 'వీర సింహా రెడ్డి' లో విలన్ గా దునియా విజయ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.;
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అందరిని ఆశ్చర్యపరుస్తూ తన తదుపరి చిత్రాన్ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ప్రకటించారు. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వారి కలయికలో పూర్తి విభిన్నమైన సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నట్లు పూరి జగన్నాధ్ స్వయంగా హామీ ఇచ్చారు.
ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, చిత్రబృందం టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో చేరినట్టు ప్రకటించింది. నివేదా థామస్ కూడా నటిస్తోంది. ఇప్పుడు, ఆసక్తిని మరింత పెంచుతూ, కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నారని వెల్లడించారు. 'వీర సింహా రెడ్డి' లో విలన్ గా దునియా విజయ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. పూరి జగన్నాధ్ ఈ భారీ కాంబినేషన్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఓ ఘనమైన విజువల్ స్పెక్టాకిల్ సిద్ధం చేస్తున్నారు. ప్రతి పాత్రా, ప్రతి నటుడి కెరీర్‌లో గుర్తుండిపోయేలా, సంచలనా త్మకంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును చార్మీ కౌర్ సహ-నిర్మాణం చేస్తున్నారు.