పెర్ఫెక్ట్ రన్ టైమ్ తో ‘కె- ర్యాంప్’ మూవీ
అవుట్‌పుట్ చాలా షార్ప్‌గా, ఎంగేజింగ్‌గా ఉండేలా చూసుకున్నాడు. సినిమా ఫైనల్ రన్-టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా లాక్ చేశారు. ఇది ఒక సినిమాకి పెర్ఫెక్ట్ రన్ టైమ్.;
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "కె-ర్యాంప్" సినిమాకి మాంచి హైప్ ఉంది. ప్రమోషన్స్‌లో కిరణ్ చాలా యాక్టివ్‌గా ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్స్‌లో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఫుల్ ఫన్, మాస్ వైబ్‌తో యూత్‌కి బాగా కనెక్ట్ అయింది.
సినిమా కంటెంట్ సూపర్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్న కిరణ్, ఒక దశలో దీన్ని తానే ప్రొడ్యూస్ చేద్దామనుకున్నాడట. అలాగే, డైరెక్టర్ జైన్స్ నానితో కలిసి సినిమా అవుట్‌పుట్ చాలా షార్ప్‌గా, ఎంగేజింగ్‌గా ఉండేలా చూసుకున్నాడు. సినిమా ఫైనల్ రన్-టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా లాక్ చేశారు. ఇది ఒక సినిమాకి పెర్ఫెక్ట్ రన్ టైమ్.
“కె-ర్యాంప్” సినిమా అక్టోబర్ 18న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కోసం ఇప్పటికే సినిమా కాపీని డిజిటల్ సర్వర్‌లలో అప్‌లోడ్ చేసేశారు. న్యూ డైరెక్టర్ జైన్స్ నాని తీసిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాను రాజేష్ దండ మరియు శివ బొమ్మక్ కలిసి నిర్మించారు.