వెంకీ - త్రివిక్రమ్ మూవీకి టైటిల్ అదేనా?
వెంకటేష్ నటిస్తున్న ఈ 77వ సినిమా కోసం టీమ్.. ‘ఆనంద నిలయం, వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం’ వంటి టైటిల్స్ పరిశీలిస్తోంది. ఈ పేర్లలోనే సినిమాలోని లవ్, హ్యూమర్ తెలిసిపోతుంది.;
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ టాలెంట్, అంచనాల పర్ఫెక్ట్ కలయికలా అనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ కూడా అలాంటిదే. వీళ్లిద్దరూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై, సూర్యదేవర రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్న ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో కొలాబరేట్ అవుతున్న సంగతి తెలిసిందే.
వెంకటేష్ నటిస్తున్న ఈ 77వ సినిమా కోసం టీమ్.. ‘ఆనంద నిలయం, వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం’ వంటి టైటిల్స్ పరిశీలిస్తోంది. ఈ పేర్లలోనే సినిమాలోని లవ్, హ్యూమర్ తెలిసిపోతుంది. అయితే ఫైనల్ టైటిల్ ‘అబ్బాయి గారు 60 ప్లస్’ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఈ టైటిల్స్ లైట్‌హార్టెడ్, ఫ్యామిలీ స్టోరీని సూచిస్తుండటంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్‌గా ఉన్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో రిలీజ్ కాబోతోంది, ఇది వెంకటేష్ కెరీర్‌లో మరో మంచి మూవీ అవుతుందని భావిస్తున్నారు. వెంకటేష్ ఎక్స్‌పీరియన్స్, త్రివిక్రమ్ హ్యూమర్ కలయికతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్యాచ్ టైటిల్, సమ్మర్ రిలీజ్‌తో ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవనుంది.