పారితోషికం భారీగానే పెంచేసింది !

'దేవర' కోసం జాన్వీ రూ. 5 కోట్లు తీసుకుంది. తదుపరి తెలుగు సినిమా 'పెద్ది' కోసం రూ. 6 కోట్లు డిమాండ్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీతో ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 7 కోట్లు అడుగుతోందని సమాచారం.;

By :  K R K
Update: 2025-07-25 02:33 GMT

బాలీవుడ్ అందాల సుందరి జాన్వీ కపూర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి ఆమె సినిమాలు లేదా ఫ్యాషన్ గురించి కాదు. టాలీవుడ్ లో ఆమె పారితోషికం ఒక్కసారిగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ఆ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది, దాంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా పెరిగింది.

2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, జాన్వీ ఇప్పటివరకూ బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వలేదు. కానీ 'దేవర' సినిమాతో తెలుగులో ఆమె తన ఆరంగేట్రంతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. వాస్తవానికి 'దేవర' కోసం జాన్వీ రూ. 5 కోట్లు తీసుకుంది. తదుపరి తెలుగు సినిమా 'పెద్ది' కోసం రూ. 6 కోట్లు డిమాండ్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీతో ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 7 కోట్లు అడుగుతోందని సమాచారం.

నిర్మాతలు ఆమెతో బేరసారాలు చేస్తున్నప్పటికీ, జాన్వీ తన డిమాండ్‌పై గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరంగా, జాన్వీ రెమ్యూనరేషన్ దక్షిణ భారత సినిమాల్లో పెరుగుతున్నప్పటికీ, బాలీవుడ్ సినిమాలకు ఆమె తక్కువ ఛార్జ్ చేస్తోంది. దీనివల్ల ఆమె కెరీర్‌లో అసమతుల్యత ఏర్పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, జాన్వీ బాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలతో రాబోతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో 'పరమ్ సుందరి', వరుణ్ ధవన్‌తో 'సన్నీ సంస్కారీ కి తులసీ కుమారీ'.

Tags:    

Similar News