పూజా హెగ్డే టాలీవుడ్ ను నిర్లక్ష్యం చేస్తోందా?
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ బుట్టబొమ్మ.. ప్రస్తుతం ఒక్క తెలుగు పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయడం లేదు. పూజా హెగ్డే ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల నుండి సుదీర్ఘ విరామం తీసుకుని.. హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించింది. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న "రెట్రో" చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
అంతేకాక, గతంలో విజయ్ సరసన "బీస్ట్" చిత్రంలో నటించిన ఆమెకు ఇది కోలీవుడ్‌కు రెండో ప్రవేశంగా చెప్పుకోవచ్చు. అదనంగా.. లోకేశ్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "కూలీ" చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. అయితే.. గత ఐదేళ్లుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమా కూడా చేయకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ఆమె హిందీ, తమిళ చిత్ర పరిశ్రమల్లో మాత్రం ఓకేషనల్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.
తెలుగు పరిశ్రమ నుండి వచ్చిన ఆమె సెలక్షన్ దృక్పథం మారిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలిచిన పూజా.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్, గ్లామర్ ఇమేజ్ కలిగిన నటి. అయినప్పటికీ, తెలుగు సినిమాలకు దూరంగా ఉండటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చివరికి, ఏ ప్రాజెక్ట్స్ చేయాలి? ఏ పరిశ్రమను ఎంచుకోవాలి? అన్నది ఆమె వ్యక్తిగత ఎంపిక. కానీ, ఆమె తీసుకుంటున్న తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. టాలీవుడ్ ను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అనిపిస్తోంది.