SSMB29 లీక్స్‌ను ఆపడం అసాధ్యం?
మహేష్-రాజమౌళి సినిమా చుట్టూ మిస్టరీ కొనసాగుతోంది. షూటింగ్ మొదలైందా? రిహార్సల్స్ జరుగుతున్నాయా? స్పష్టత లేనప్పటికీ, కొంతమంది ఊహిస్తున్నట్లు ఏదో జరుగుతోంది. అయితే, ఈసారి లీకులు తప్పకపోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా ఔట్‌డోర్ షూటింగ్‌కు షిఫ్ట్ అయింది.
యూనిట్ తాజాగా ఒడిశాలోని కోరాపుట్ వెళ్లగా, అక్కడ మహేష్ బాబు ఫోటోలు బయటపడ్డాయి. అంతేకాదు, ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారనే విషయం లీక్ అయింది. దీంతో పాటు, సినిమా సెట్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఈసారి లీకుల్ని పూర్తిగా అడ్డుకోవడం కష్టమే అనిపిస్తోంది. సినిమా ఎక్కువ శాతం వైజాగ్, కెన్యా, శ్రీలంక వంటి ఔట్‌డోర్ లొకేషన్లలోనే చిత్రీకరించనుండటంతో మరిన్ని లీకులు వెలువడే అవకాశముంది.