‘ది రాజాసాబ్’ కొత్త తేదీపై ఆసక్తికర బజ్!

Update: 2025-02-25 12:11 GMT

ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ‘ది రాజాసాబ్‘. మారుతి దర్శకత్వంలో హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ నుంచి వస్తోన్న హారర్ జానర్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని మొదటగా ఏప్రిల్ 10న విడుదల చేద్దామనుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ‘రాజాసాబ్‘ ఆ సమయానికి రావడం లేదని తేలిపోయింది.

తాజాగా ‘రాజాసాబ్‘ కొత్త విడుదల తేదీని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘రాజాసాబ్‘ న్యూ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనుందట. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘రాజాసాబ్‘ రెండు భాగాలుగా రానుందనే ప్రచారమూ ఉంది

Tags:    

Similar News