‘హిట్ 3’ కోసం రంగంలోకి దుల్కర్ సల్మాన్

తాజా సమాచారం ప్రకారం, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేరళలో దుల్కర్ సల్మాన్ ద్వారా విడుదల చేయనున్నారు.;

By :  K R K
Update: 2025-04-17 01:09 GMT

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3’. ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలకు సన్నాహాలు జరుగుతుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి కేరళ విడుదలపై తాజా అప్‌డేట్ వెలువడింది. తాజా సమాచారం ప్రకారం, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేరళలో దుల్కర్ సల్మాన్ ద్వారా విడుదల చేయనున్నారు.

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు స్వంతంగా వేఫేరర్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్, డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఉంది. సో.. ‘హిట్ 3’ సినిమాను కేరళలో వేఫేరర్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ఇది సినిమా టీమ్‌కు ఒక భారీ ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. దుల్కర్ సల్మాన్ సంస్థకు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ వల్ల, హిట్ 3 సినిమాకు కేరళలో మంచి వసూళ్లతోపాటు గట్టి విడుదల అవకాశాలు లభించనున్నాయి.

ఈ మేరకు ‘హిట్ 3’ సినిమాకు మే 1న గ్రాండ్ రిలీజ్‌కు వేదిక సిద్ధమైంది. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలకానున్న ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ 1 అండ్ 2 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మూడో భాగంపై విపరీతమైన అంచనాలున్నాయి. అందులోనూ నానీ హీరోగా కాబట్టి ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయింది. 

Tags:    

Similar News