మజాకా సినిమా తో ఒక కొత్త కేరక్టర్ లో కనిపించబోతున్న: హీరోయిన్ రీతూ వర్మ

Update: 2025-02-20 08:52 GMT

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్ లో ల్యాండ్‌మార్క్ సినిమాగా మజాకా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధమాకా సినిమా తో సూపర్ హిట్ అందుకున్న త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సందీప్ కిషన్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తుంది. రావు రమేష్,మన్మధుడు ఫేమ్ అన్షు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26 న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయిపోతుంది. ఈ నేపథ్యంలో రీతూ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రీతూ వర్మ మాట్లాడుతూ.."ప్రసన్న గారు ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది.సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ వుంది. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడాలేదు' అని ఆయన చెప్పడం నాకు గుర్తుండిపోయే మోమెంట్.ఇందులో యంగ్ కాలేజ్ గర్ల్ గా కనిపిస్తా. బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? సందీప్ క్యారెక్టర్ తో తన రిలేషన్ షిప్ ?.. ఇలా చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్ లో కనిపిస్తా. ఆడియన్స్ కి నచ్చుతుందనే నమ్మకం వుంది.

రాజేష్ గారు, అనిల్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. వారి ప్రొడక్షన్ లో మరో సినిమా చేయాలని వుంది. ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది." అని అన్నారు.

Tags:    

Similar News