పూరి - ఛార్మి మధ్య గ్యాప్?

Update: 2025-03-13 07:54 GMT

హీరోల ఇమేజ్ ను అమాంతం పెంచే దర్శకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు పేరుంది. అయితే పెద్ద హీరోలంతా తనతో సినిమా చేయాలని ఉత్సాహం చూపే రోజుల నుంచి, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసే స్థితికి పూరి పరిస్థితి మారిపోయింది. ‘లైగర్, డబుల్ ఇస్మార్ట్‘ వంటి వరుస పరాజయాలు పూరి జగన్నాథ్ ను గందరగోళంలో పడేశాయి.

ఇప్పటివరకు తన సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉన్న ఛార్మి వల్లే హీరోలు పూరితో సినిమా చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని టాలీవుడ్ లో ఓ టాక్. దీంతో.. పూరి కొత్త సినిమా అవకాశాల కోసం ఛార్మిని ప్రొడక్షన్ వ్యవహారాల నుండి తప్పించే ప్రయత్నంలో ఉన్నారనేది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కథనం. ఇకపై ఛార్మి నిర్మాతగా లేకుండా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడట పూరి.

ఒక్క హిట్.. అదే పూరి జగన్నాథ్ మళ్లీ రేసులోకి వచ్చే మార్గం. కానీ ఆ హిట్ కోసం కేవలం ఛార్మిని ప్రొడక్షన్ నుంచి తప్పించడం సరిపోదు. ఆడియెన్స్‌ను ఆకట్టుకునే స్టోరీ, కంటెంట్ పై దృష్టి పెట్టాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషణకులు. ఇప్పటికే చాలా సార్లు అపజయాలు అందుకోవడం.. మళ్లీ ఒక్క హిట్ తో ఫామ్ లోకి రావడం పూరి విషయంలో జరిగింది. మరోవైపు త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట డాషింగ్ డైరెక్టర్.

Tags:    

Similar News