శ్రీలీల గురించి ఈ విషయం తెలుసా?

Update: 2025-03-14 09:37 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల గురించి ఒక తెలియని విషయం ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఆమె ఎంతో సుగుణాల రాశి అని సినీ రంగం నుంచి వినిపించే మాట. ఆమెతో కలిసి పనిచేసిన అనేకమంది నటులు, టెక్నీషియన్లు ఆమె మానవీయత గురించి ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె గొప్ప మనసు చాటుకుందట. శ్రీలీల 2022లోనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. గురు, శోభిత అనే పిల్లలను ఓ అనాథాశ్రమం నుంచి ఆమె దత్తత తీసుకొని, వారి సంరక్షణ బాధ్యతను స్వయంగా చేపట్టిందని తెలుస్తోంది.

ఆమె సినీ రంగంలో స్థిరపడిన వెంటనే తన సంపాదనలో కొంత భాగాన్ని మంచి పనికి వినియోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందట. ఇద్దరు పిల్లలను పూర్తిగా స్వంతంగా చూసుకోవడమే కాక, వారికి సముచితమైన జీవన సౌకర్యాలు కల్పిస్తూ, కొత్త జీవితాన్నే అందించింది.

శ్రీలీల సహజంగా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆమె వైద్య విద్యను అభ్యసించడం కూడా దీనికి అద్దం పడుతుంది. ఆమె త్వరలోనే డాక్టర్‌ గా మారనుంది. ఒకవైపు కళారంగంలో దూసుకుపోతూనే, మరోవైపు తన సంపాదనతో మానవ సేవకు అంకితమవుతున్న ఆమె నిజంగా ప్రశంసనీయమైన వ్యక్తి. శ్రీలీల తన అద్భుతమైన నృత్యాలతో వెండితెరను తళుక్కుమనిపిస్తోంది. ఇటీవల "పుష్ప 2" లో "కిస్సిక" పాటకు ఆమె వేసిన స్టెప్పులు అభిమానులను ఊపేస్తున్నాయి.

Tags:    

Similar News