మళ్లీ మెగా ఫోన్ పడుతున్న పోసాని కృష్ణ మురళి !
పోసాని మళ్లీ దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈసారి అతను ఒక సోషల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అతనే హీరోగా, విలన్‌గా కూడా నటిస్తున్నాడు.;
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన నటుడు పోసాని కృష్ణ మురళి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోసాని కృష్ణ మురళి కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఇది అతనికి పెద్ద పాఠంగా నిలిచింది.
ఇప్పుడు పోసాని మారిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని వృత్తిపరమైన ఎంపికల్లో కూడా పూర్తి మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో గళమెత్తిన ఈ నటదర్శకుడు మళ్లీ తన అసలు సినీ ప్రస్థానం వైపు అడుగులు వేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. పోసాని మళ్లీ దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈసారి అతను ఒక సోషల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అతనే హీరోగా, విలన్‌గా కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన పోసాని.. ఈ చిత్రం గురించి స్వయంగా ధృవీకరించాడు. చిత్రం టైటిల్ ‘అరుణ రెడ్డి’ అని.. ఇది ఆకట్టుకునే కథాంశంతో కూడిన మంచి కథ అని చెప్పాడు.
జైలు అనుభవం పోసానిలో స్పష్టమైన ప్రవర్తనాపరమైన మార్పులను తెచ్చినట్లు కనిపిస్తోంది. అతను ఇప్పుడు మరింత ఆలోచనాత్మకంగా, నిగ్రహంగా మాట్లాడుతున్నాడు. ఇది చాలామంది అతని నుండి ఆశించిన సానుకూల మార్పు. మరి ‘అరుణ రెడ్డి’ గా టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారో చూడాలి.