నాగ్ అశ్విన్ లేడీ ఓరియెంటెడ్ మూవీ?

తాజా సమాచారం ప్రకారం.. నాగ్ అశ్విన్ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీని సీనియర్ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస రావు అందిస్తున్నారని బజ్.;

By :  K R K
Update: 2025-08-28 00:45 GMT

డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఆయన ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ రాలేదు. ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ లైనప్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. నాగ్ అశ్విన్ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీని సీనియర్ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస రావు అందిస్తున్నారని బజ్. గతంలో నాగ్ అశ్విన్, ఆలియా భట్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఒక మహిళా కేంద్రిత చిత్రం తీస్తారని రూమర్స్ వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజెక్ట్‌ను ఒకింత వాయిదా వేశారని లేదా రద్దు చేశారని తెలుస్తోంది.

ఇంకా ఆసక్తికరంగా.. ఈ కొత్త సినిమాలో ప్రధాన పాత్ర కోసం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక ప్రముఖ హీరోయిన్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే, ఇందులో ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. ఈ ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ నిర్మించనుంది. ఇవి కాకుండా, నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Tags:    

Similar News