‘మిరాయ్’ టీమ్ కు దిల్ రాజ్ పార్టీ
యంగ్ హీరో తేజ సజ్జ నటించిన 'మిరాయ్' సినిమా సక్సెస్‌ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. 'మిరాయ్' సినిమాను నిర్మించింది టీజీ విశ్వ ప్రసాద్ అయినా, దిల్ రాజు స్పెషల్‌గా తేజ సజ్జ అండ్ టీమ్ కోసం పార్టీ ఇచ్చారు.;
దిల్ రాజు ఎప్పుడూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. పెద్ద స్టార్స్‌తో పాటు కొత్త హీరోలను కూడా ఆయన సపోర్ట్ చేస్తుంటారు. ఈ మధ్యనే యంగ్ హీరో తేజ సజ్జ నటించిన 'మిరాయ్' సినిమా సక్సెస్‌ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. 'మిరాయ్' సినిమాను నిర్మించింది టీజీ విశ్వ ప్రసాద్ అయినా, దిల్ రాజు స్పెషల్‌గా తేజ సజ్జ అండ్ టీమ్ కోసం పార్టీ ఇచ్చారు.
తేజ, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, ఇంకా ఇతర టెక్నీషియన్స్‌ని తన ఇంటికి పిలిచి కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత పార్టీతో సక్సెస్ హుషారుగా జరుపుకున్నారు. పంచవ్యాప్తంగా దాదాపు రూ. 150 కోట్లు వసూలు చేసిన 'మిరాయ్'తో తేజ సజ్జ టాలీవుడ్‌లో మంచి ప్రామిసింగ్ హీరోగా తన ప్లేస్‌ని కన్‌ఫర్మ్ చేసుకున్నారు. ఆయన ఇప్పటికే మరో రెండు సినిమాలు సైన్ చేశాడు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా రితికా నాయక్ నటించగా, మంచు మనోజ్ విలన్‌గా కనిపించారు. శ్రియా శరణ్ తేజ సజ్జ తల్లి పాత్ర పోషించారు. థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే 'మిరాయ్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 10 నుండి జియోహాట్‌స్టార్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.