కొత్త షెడ్యూల్ మొదలు పెట్టిన ‘డెకాయిట్’

ఈ రోజు నుంచి ఓ కీలక షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో గేమ్-ఛేంజర్‌గా నిలిచే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.;

By :  K R K
Update: 2025-06-08 06:13 GMT

ఫార్ములా సినిమాలకు దూరంగా ఉంటూ..  ఎప్పుడూ హార్ట్ టచింగ్ కథలను ఎంచుకునే అడివి శేష్... ఈసారి షానియల్ డియో దర్శకత్వంలో పాన్-ఇండియన్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహ-నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా తాజాగా విడుదలైన ఫైర్ గ్లింప్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. అద్భుతమైన విజువల్స్, గట్టి టోన్‌తో ఈ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ హై-స్టేక్స్ డ్రామాలో శేష్‌తో పాటు మృణాళ్ ఠాకూర్ కూడా నటిస్తోంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమాకు సంబంధించిన పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. డబ్బింగ్ టెస్ట్ ఇప్పటికే పూర్తయింది. అడివి శేష్ స్టూడియో నుంచి కొన్ని క్షణాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రెట్టింపు చేశాడు. ఇక ఈ రోజు నుంచి ఓ కీలక షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో గేమ్-ఛేంజర్‌గా నిలిచే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ రెండూ ఏకకాలంలో సాగుతుండటంతో, టీమ్ ప్రతి అడుగూ ఖచ్చితంగా వేస్తోంది.

డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్న ‘డకాయిట్’ మూవీ శేష్‌కి తొలి క్రిస్మస్ రిలీజ్. ఈ టైమింగ్ మాత్రం యాదృచ్ఛికం కాదు. హాలిడే రిలీజ్‌లు ఎప్పుడూ హై-స్టేక్స్‌తో కూడినవి. ఈ కాంపిటీటివ్ విండోలో ‘డకాయిట్’ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. టీజర్ ఇప్పటికే బెంచ్‌మార్క్‌లను సెట్ చేసిన నేపథ్యంలో.. ఈ మూవీ ఈ హైప్‌ను అందుకోగలదా, అంతకు మించగలదా అనేది ఇప్పుడు కీలకం. మరి అడివి శేష్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News