టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న డేవిడ్ వార్నర్ !
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ దేవిడ్ వార్నర్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు భాషను ఆప్యాయంగా అలవర్చుకోవడమే కాకుండా, తను, తన కుటుంబ సభ్యులు కలిసి తెలుగు పాటలకు డాన్స్ చేసే రీల్స్‌ను పంచుకోవడం, స్టేడియంలోనూ తెలుగు పాటలకు స్టెప్పులు వేయడం వంటివి.. ఆయనను తెలుగువారి మనసుకు మరింత దగ్గర చేశాయి.
ఇప్పటి వరకు దేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల్లో నటించబోతున్నాడు.. అనే ఊహాగానాలు వినిపించేవి. ఇప్పుడు అవి నిజమయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నితిన్ "రాబిన్ హుడ్" సినిమాలో దేవిడ్ వార్నర్ ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించనున్నారని నిర్మాత రవి శంకర్ అధికారికంగా ప్రకటించారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెరపై వార్నర్‌ను చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం కలిగిన వార్నర్.. ఈ సినిమాలో ఏ రకమైన పాత్రలో మెప్పించనున్నారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నితిన్, శ్రీలీల జంటగా నటించిన, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన "రోబిన్ హుడ్" ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది.