రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న క్రేజీ మల్టీస్టారర్!

Update: 2025-02-27 09:15 GMT

కింగ్ నాగార్జున, ధనుష్ కలయికలో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘కుబేర‘. ఈ సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో కనిపించనుండగా, ఆయన పాత్రకు ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంటుందట. నాగార్జున ఈడీ అధికారిగా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ‘కుబేర‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జూన్ 20న ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.




 ఈ పోస్టర్ లో నాగార్జున, ధనుష్ ఎదురెదురుగా నిలబడి ఉండగా, బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ మధ్యలో కనిపిస్తున్నాడు. మరోవైపు వరుసగా పాన్ ఇండియా హిట్స్ అందుకుంటున్న నేషనల్ క్రష్ రష్మిక ‘కుబేర‘లో హీరోయిన్ గా నటిస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై సెన్సిబుల్ స్టోరీస్ ను ఎక్కువగా ఆవిష్కరించే శేఖర్ కమ్ముల.. ‘కుబేర‘తో ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నట్టే కనిపిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండడం మరో విశేషం.




 


Tags:    

Similar News