ఓవర్ సీస్ లో దూసుకుపోతున్న ‘కోర్ట్’ మూవీ!

మార్చి 14న విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. తొలి షో నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి.;

By :  K R K
Update: 2025-03-18 06:14 GMT

ప్రియదర్శి, శ్రీదేవి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కోర్ట్’. మార్చి 14న విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. తొలి షో నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. ‘కోర్ట్’ ఓపెనింగ్‌ డే రూ.4.15 కోట్లు వసూల్ చేయగా, రెండో రోజు శనివారం రూ.4.75 కోట్లు రాబట్టింది. నాలుగు రోజుల్లో సినిమా మొత్తం రూ. 14.84 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరింతగా రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

అమెరికాలో ‘కోర్ట్’ ఇప్పటికే 700K డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ జోరు కొనసాగితే వన్ మిలియన్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. హీరో నాని ఈ చిత్రాన్ని రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు సమాచారం. ప్రస్తుత కలెక్షన్లను బట్టి చూస్తే, సినిమా బ్రేక్ ఈవెన్ దశకు చేరుకున్నట్టేనని చెప్పొచ్చు. అంతేకాదు, ఓటీటీ హక్కులు, మ్యూజికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. సినిమా మరోసారి నాని ప్రొడక్షన్ సెన్స్ ను నిరూపించడంతో పాటు.. మంచి వసూళ్లను రాబట్టడం గమనార్హం.

Tags:    

Similar News