తెలుగులోనూ దూసుకుపోతున్న ‘ఛావా‘

Update: 2025-03-08 08:24 GMT

విక్కీ కౌశల్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఛావా’ హిందీలో ఘనవిజయం సాధించింది. శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హిందీలో భారీ విజయాన్ని అందుకున్న వెంటనే తెలుగులో డబ్బింగ్‌ కోసం మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈనేపథ్యంలో నిన్న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది.




 


తెలుగులో విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ చిత్రం రూ.3.03 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓ డబ్బింగ్‌ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం విశేషంగా మారింది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

Tags:    

Similar News