లుక్ టెస్ట్.. కాన్సెప్ట్ ఫోటో షూట్ మొదలైంది

ఇటీవలే ప్రకటించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్టుకు సంబంధించి.. ముంబైలోని బాంద్రాలో ఉన్న మెహబూబ్ స్టూడియోలో ఆదివారం లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటోషూట్ నిర్వహించారు.;

By :  K R K
Update: 2025-04-21 05:26 GMT

‘పుష్ప 2: ది రూల్’ మూవీతో అద్భుత విజయాన్ని సాధించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ఈ సక్సెస్ ను సస్టెయిన్ చేసే ఆలోచనతో, అందుకు తగ్గట్టుగానే తన తదుపరి ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకుంటున్నాడు. అందులో భాగంగా.. ‘జవాన్’ వంటి యాక్షన్ మూవీతో ఘన విజయం సాధించిన తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తన తదుపరి సినిమాకు అల్లు అర్జున్ శ్రీకారం చుట్టాడు. ఇటీవలే ప్రకటించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్టుకు సంబంధించి.. ముంబైలోని బాంద్రాలో ఉన్న మెహబూబ్ స్టూడియోలో ఆదివారం లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటోషూట్ నిర్వహించారు.

తాజా సమాచారం ప్రకారం... అల్లు అర్జున్ క్యారెక్టర్‌కు సంబంధించి రగ్గడ్ స్టైల్ నుంచి స్లీక్ లుక్ వరకూ.. పలు స్టైళ్లను, లుక్స్‌ను ట్రై చేశాడట డైరక్టర్ అట్లీ. ‘పుష్ప’ ఫ్రాంచైజ్‌తో అల్లు అర్జున్ ఒక మాస్ అండ్ రఫ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. అట్లీ మాత్రం దీని నుంచి పూర్తి భిన్నమైన, కొత్త అవతారంలో అల్లు అర్జున్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఎంతో హ్యాండ్స్-ఆన్‌గా వ్యవహరిస్తూ లుక్ టెస్టుల్లో చురుగ్గా పాల్గొన్నాడు.. అని వినికిడి.

చిత్రానికి సంబంధించిన కథా సారాంశం ఇప్పటివరకు గోప్యంగా ఉంచినప్పటికీ, ఇది ఓ హై-కాన్సెప్ట్ యాక్షన్ డ్రామా అని ప్రచారం జరుగుతోంది. ఇక లుక్ టెస్ట్‌లో భాగంగా... 12 ఏళ్ల పిల్లలను కొందరిని కూడా తీసుకువచ్చి ఎంపిక కార్యక్రమం నిర్వహించారట. కథలో కీలక పాత్ర కోసం ఇది జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే, ఈ సినిమా షూటింగ్ జూన్ చివరిలో ప్రారంభం కానుంది. టైటిల్, నటీనటుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రక టించనున్నారు.

Tags:    

Similar News