అల్లు - అట్లీ కాంబో మూవీకి ముహూర్తం అప్పుడేనా !
అల్లూ అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు. అట్లీ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించగా, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.;
స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్, మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్‌కు మాస్టర్ అయిన అట్లీ కలయికలోని తొలి చిత్రం అధికారికంగా ఫైనల్ అయినట్టు టాక్. గత కొంతకాలంగా ఊహాగానాలు, చర్చలు నడుస్తున్నా, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అన్ని ఒప్పందాలు ఖరారయ్యాయట. ఈ సినిమా అట్లీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలవనుంది. ₹600–700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం, అల్లూ అర్జున్ పాన్-ఇండియా స్టార్‌గా మరింత గ్లోబల్ రీచ్ పొందేందుకు ప్రధాన మైలురాయిగా మారనుంది.
అల్లూ అర్జున్ ఈ సినిమా నుంచి ప్రాఫిట్ షేర్ తీసుకుంటుండటం, అతని రెమ్యునరేషన్ రూ. 175 కోట్లుగా ఫిక్స్ కావడం ఈ చిత్ర ప్రత్యేకత. అట్లీ కూడా తన పారితోషికం కోసం ప్రత్యేకంగా డిమాండ్ చేసినట్టు సమాచారం. అసలు విషయమేమిటంటే, ‘పుష్ప 2’ చిత్రీకరణ సమయంలోనే అల్లూ అర్జున్ - అట్లీ కాంబినేషన్‌పై చర్చలు మొదలయ్యాయి. కానీ అప్పట్లో బడ్జెట్, రెమ్యునరేషన్ పరంగా కొన్ని సమస్యలు తలెత్తాయి. అయితే పుష్ప 2 ఘన విజయం సాధించి, హిందీ మార్కెట్‌లో అల్లూ అర్జున్ క్రేజ్ తారాస్థాయికి చేరుకున్న తర్వాత, అట్లీ మరోసారి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
సన్ పిక్చర్స్ అన్ని షరతులను అంగీకరించడంతో, ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రం కథ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అట్లీ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇందులో రెండు అంతర్జాతీయ స్థాయి కథానాయికలు నటించనున్నట్టు సమాచారం. బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. హాలీవుడ్ టెక్నీషియన్లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాకు సంగీతం అందించేందుకు అనిరుధ్ రవిచందర్‌ను ఫైనల్ చేశారు. అట్లీ సినిమాలకు మ్యూజిక్ హైలైట్‌గా నిలిచిన ఉదాహరణలు లేకపోలేదు. ఇప్పటికే తలపతి విజయ్ చిత్రాలకు, జవాన్ చిత్రానికి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మ్యూజిక్ కూడా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసేలా ఉండబోతుందని అంచనా. అన్ని ఒప్పందాలు ఖరారు కావడంతో, అల్లూ అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు. అట్లీ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించగా, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.