ఇప్పుడు అందరి దృష్టి భాగ్యశ్రీ పైనే !

ఒక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, ఆమె ఇప్పటికే దాదాపు అరడజను తెలుగు సినిమాల్లో సైన్ చేసేసింది. రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా, మూడు సినిమాలు ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి.;

By :  K R K
Update: 2025-07-15 12:53 GMT

భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్ లో అదృష్టవంతురాలైన కొత్త హీరోయిన్ అని చెప్పుకోవాలి. ఒక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, ఆమె ఇప్పటికే దాదాపు అరడజను తెలుగు సినిమాల్లో సైన్ చేసేసింది. రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా, మూడు సినిమాలు ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి. దీంతో ఆమె పేరు త్వరగా సుపరిచితం అవుతోంది. ఆమె తెలుగు డెబ్యూ “మిస్టర్ బచ్చన్” దురదృష్టవశాత్తూ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. అయినా, భాగ్యశ్రీ తన ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ క్రేజ్‌తోనే ఆమె విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్”, రామ్ పోతినేని “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమాల్లో లీడ్ రోల్స్ సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు ఆమె టాలెంట్‌ను నిరూపించుకోవడానికి, కేవలం ఆకర్షణీయమైన ముఖం కాకుండా స్థిరపడటానికి కీలకం కానున్నాయి. “కింగ్‌డమ్” జులై 31న రిలీజ్ కానుండగా, “ఆంధ్ర కింగ్ తాలుకా” షూటింగ్ పూర్తయింది. మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీని రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు.

ఇప్పుడు అందరి ఫోకస్ భాగ్యశ్రీ మీదే ఉంది. ఆమె ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తన చుట్టూ ఉన్న హైప్‌కు తగ్గట్టు హిట్స్ కొట్టగలదా అనేది ఆసక్తిగా మారింది. ఇటు గ్లామర్, అటు తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించ గలిగే టాలెంట్ కలిగిన భాగ్యశ్రీ .. ఒక్క హిట్ కొట్టినా.. టాలీవుడ్ లో ఆమె దశ తిరగడం ఖాయం అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి భాగ్యశ్రీ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News