తెలుగులోకి సూపర్ హిట్ మలయాళ చిత్రం

ఈ చిత్రం తెలుగు వెర్షన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 25 న "జిమ్కానా" పేరుతో థియేటర్లలో విడుదల కానుంది.;

By :  K R K
Update: 2025-04-18 02:03 GMT

ఈ ఏడాది ఏప్రిల్ 10న భారీ అంచనాల మధ్య విడుదలైన "ఆలప్పుళ జిమ్కానా" మలయాళ చిత్రం.. కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 25 న "జిమ్కానా" పేరుతో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా కథ ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన కొంతమంది యువతీ యువకులు, క్రీడల కోటా ద్వారా సాధారణ కాలేజీలో అడ్మిషన్ పొందేందుకు బాక్సింగ్‌ను ఎంచుకుంటారు. మొదటి దశలో జిల్లా స్థాయి పోటీలను కేవలం అదృష్టంతో గట్టెక్కిన వీరు, ఇకపై మరింత ప్రతిభావంతులైన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది. హాస్యం, ఉత్సాహం, థ్రిల్లింగ్‌తో మేళవించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ప్రేమలు ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో కనిపించగా.. లుక్‌మన్ అవరన్, గణపతి ఎస్. పొడువల్, సందీప్ ప్రదీప్, అనఘ మాయా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, ర్యాపర్ హబీష్ రహ్మాన్ అలియాస్ బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘తల్లుమాల’ చిత్రంతో గుర్తింపు పొందిన ఖాలిద్ రెహ్మాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీని ససీంద్రన్‌తో కలిసి స్క్రీన్‌ప్లేను రచించాడు. విష్ణు విజయ్ సంగీతం అందించాడు.

Tags:    

Similar News