హిమాలయాల్లో 'అఖండ' ఎపిక్ యాక్షన్!

Update: 2025-03-01 19:22 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అఖండ 2'. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ దాని సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’ గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి అత్యద్భుతమైన విజువల్స్ అందించేందుకు బోయపాటి హిమాలయాల్లో ప్రత్యేకమైన లొకేషన్ల వేటలో ఉన్నాడట. ఇంతకు ముందు తెలుగు చిత్రాల్లో కనబడని లొకేషన్లను ఎంపిక చేసి, బాలకృష్ణను అఘోర గెటప్‌లో హై ఇంటెన్స్ గా చూపించబోతున్నాడట.

ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనుండగా, సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కానుంది.

Tags:    

Similar News