క్లైమాక్స్ పూర్తి చేసుకున్న ‘అఖండ 2’
క్లైమాక్స్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలిపారు. "నేను, సంయుక్తతో కలిసి జార్జియాలో క్లైమాక్స్ సీన్స్ షూట్ చేసి రీసెంట్‌గా తిరిగొచ్చాం. అని బాలయ్య చెప్పారు.;
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ "అఖండ 2" దసరా సీజన్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదని బాలయ్య స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఏలూరులో జరిగిన ఓ ఈవెంట్‌లో మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, సినిమా షూటింగ్ అప్‌డేట్స్‌తో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు.
మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ, సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలిపారు. "నేను, సంయుక్తతో కలిసి జార్జియాలో క్లైమాక్స్ సీన్స్ షూట్ చేసి రీసెంట్‌గా తిరిగొచ్చాం. 'అఖండ 2' సినిమా సూపర్‌గా తీర్చిదిద్దబడుతోంది. ఫ్యాన్స్ అంచనాలను మించేలా ఉంటుంది. టీజర్‌కు మెగా రెస్పాన్స్ వచ్చింది, అందరూ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గతంలో అనౌన్స్ చేసినట్లే, సెప్టెంబర్‌లో రిలీజ్ ఫిక్స్," అని బాలకృష్ణ ధీమాగా చెప్పారు.
ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సీక్వెల్‌నకు ఫైర్‌బ్రాండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. బ్లాక్‌బస్టర్ సినిమా "అఖండ" కి కొనసాగింపుగా రాబోతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, సంయుక్త కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ మాస్ట్రో తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు, ఇది సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది.